నయనతార డాక్యుమెంటరీ వివాదం.. ధనుష్‌కు అనుకూలంగా మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

నయనతార వర్సెస్ ధనుష్ వ్యవహారం సినిమా ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమైంది. దశాబ్దాలుగా సినిమా పరిశ్రమలో ఉన్న వీరి మధ్య గొడవలు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం (జనవరి 28) మద్రాస్ కోర్టు కీలక తీర్పును వెలువరించింది.

లేడీ సూపర్ స్టార్ నయనతార తన పెళ్లి డాక్యుమెంటరీ కోసం అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ చిత్రంలోని సన్నివేశాన్ని ఉపయోగించుకుంది. దీంతో హీరో ధనుష్‌ కోర్టులో కాపీరైట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేసిన ‘నెట్‌ఫ్లిక్స్ ఇండియా’ ధనుష్ పిటిషన్ ను కొట్టేయాలని మద్రాసు హైకోర్టులో దరఖాస్తు చేసింది. అయితే ఈ పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. గత నవంబర్‌లో నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్, వారి నిర్మాణ సంస్థ ‘రౌడీ పిక్చర్స్’ ధనుష్‌పై కేసు పెట్టాడు. ‘నెట్‌ఫ్లిక్స్’ డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిర్ టేల్’లో ‘నానుమ్ రౌడీ దాన్’ చిత్రంలోని 3 సెకన్ల సన్నివేశాన్ని ఉపయోగించారని ధనుష్ ఆరోపించారు. అనుమతి లేకుండా వాడిన సీన్‌ను 24 గంటల్లోగా తొలగించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ధనుష్ హెచ్చరించారు. అయితే ఆ సీన్ మాత్రం తీయలేదు. దీంతో ధనుష్ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యాడు.

ఈ విషయంలో ధనుష్ నిర్మాణ సంస్థ ‘వండబార్ ఫిల్మ్స్’ నష్టపరిహారం డిమాండ్ చేసింది. ఈ వివాదం సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించింది. ధనుష్, నయనతార ఇద్దరు భారతీయ చలనచిత్ర స్టార్ నటులు. కొన్ని దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఉన్నారు. ఇద్దరికీ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటిది ఇద్దరి మధ్య గొడవలు రావడం అందరినీ షాక్ కు గురి చేసింది. నయనతార డాక్యుమెంటరీపై ధనుష్ కోర్టులో కాపీరైట్ పిటిషన్ దాఖలు చేశారు. తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్‌ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ నయన తారకు లీగల్‌ నోటీసులు పంపించారు. దీనిపై స్పందించిన నయనతార ధనుష్ ను విమర్శిస్తూ బహిరంగ లేఖ రిలీజ్ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరిపోయింది. ఇప్పుడీ విషయంలో ధనుష్ కు అనుకూలంగా కోర్టు తీర్పు వెలువరించింది. మరి దీనిపై నయనతార ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button