Trending

గోల్కొండ కోటపై రెప రెప లాడిన జాతీయ జెండా.. జాతిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం

Telangana Latest News: గోల్కొండ కోటపై జాతీయ జెండా రెప రెపలాడింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలో సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండా ఎగురవేసి తొలిసారి గోల్కొండ కోట నుంచి జాతిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. భారతదేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటీషు బానిస సంకెళ్లు తెంచి… స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినం. మన దేశ అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని మువ్వన్నెల జెండాగా సగర్వంగా ఎగరేసిన ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజని తెలిపారు.

ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఎందరో మహనీయుల త్యాగ ఫలం. సుదీర్ఘ పోరాట ఫలితం. అనేక ప్రాణత్యాగాలు, అనేకానేక జీవిత త్యాగాల ఫలితం ఈ స్వాతంత్య్రం. ఎందరో మహామహుల త్యాగాల వెల కట్టలేని బహుమతి ఈ స్వాతంత్య్రం. అటువంటి మహనీయులందరికీ శిరస్సు వంచి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. వారి త్యాగాలను స్మరిస్తూ… తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పోరాటం అంటే ఘర్షణ…. యుద్ధం… హింస. కానీ, ప్రపంచ చరిత్రలోనే ఆయుధం లేని యుద్ధం మన స్వాతంత్ర్య పోరాటం. అహింసనే ఆయుధంగా మలిచి చేసిన మహా సంగ్రామం మన స్వాతంత్య్ర సంగ్రామం. అహింస అనే ఆయుధంతో ఇంత గొప్ప విజయాన్ని సాధించవచ్చు అని రుజువు చేసి… ప్రపంచానికి సరికొత్త యుద్ధ తంత్రాన్ని చూపించిన దేశం మనది. ఆ ఘనత, ఆ కీర్తి జాతిపిత మహాత్మాగాంధీకి దక్కుతుంది. ఈ సందర్భంగా ఆ మహనీయుడి దార్శనికతకు, శిరస్సువంచి నమస్కరిస్తున్నాను.y a matter of holding on after others have let go!

 

Related Articles

Back to top button