ఏటీఎంల నుంచి పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా.. కొత్త యాప్.. ఎప్పటి నుంచో తెలుసా?

EPFO 3.0 : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కోట్లాది మంది కస్టమర్లకు ఒక పెద్ద శుభవార్త అందించింది. కొత్త PF విధానం జూన్ 2025 నాటికి అమలులోకి వస్తుంది. కొత్త విధానంలో కొత్త యాప్, ATM నుండి PF డబ్బును విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుందని తెలిపింది. ఈపీఎఫ్‌వో కొత్త సాఫ్ట్‌వేర్ సిస్టమ్ EPFO 3.0 ఈ సంవత్సరం ప్రారంభించబడుతుందని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. ఈ కొత్త వ్యవస్థ ఉద్యోగులకు అనుకూలమైన, యూజర్ ఫ్రెండ్లీ అనుభవాన్ని అందిస్తుంది.
EPFO 3.0 కింద సభ్యులందరికీ ATM కార్డులు ఇవ్వబడతాయి. ఈ కార్డ్ ద్వారా, ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) ఖాతా మొత్తాన్ని సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ సేవ ముఖ్యంగా ఆర్థిక అత్యవసర సమయాల్లో సహాయపడుతుంది. వెబ్‌సైట్, సిస్టమ్‌లో ప్రాథమిక మెరుగుదలలు ఈ నెలలోపు పూర్తవుతాయని కేంద్ర మంత్రి మాండవ్య తెలిపారు. దీని తర్వాత EPFO 3.0 దశలవారీగా అమలు చేయనున్నట్లు చెప్పారు.



