555 సార్లు రీ రిలీజ్
70 సార్లు వంద రోజులు
ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజుల ట్రెండ్ నడుస్తోంది . ఒక సినిమా ఒకసారి రీ రిలీజ్ అయితే ఓకే , రెండోసారి అయితే సూపర్ అన్నట్టు. అంతకంటే ఎక్కువసార్లు రిలీజ్ అయితే మాత్రం అది ఒక విశేషముగానే చెప్పాలి . కానీ ఒక సినిమా ఏకంగా 555 సార్లు రీ రిలీజ్ అయితే…. ఏంటి నమ్మట్లేదా ? జోక్ చేయకు బ్రో అంటారా ? కానీ ఇది నిజంగా నిజం . ఆ సినిమా కన్నడ ఇండస్ట్రీ హిట్ ” ఓం ” . 1995 మే 19న ఓం సినిమా రిలీజైంది. ఈ మూవీకి ఉపేంద్ర డైరెక్టర్. శివరాజ్ కుమార్ హీరో . అప్పట్లో ఇది సెన్సేషనల్ స్టోరీ … కన్నడ సినీ చరిత్రలోనే కల్ట్ క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోయింది. ఇప్పుడు 30 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మరోసారి మే 19న రీ రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఇలా ఓం మూవీ ఇప్పటికే 555 సార్లు రీ రిలీజైంది. బెంగళూరులోని కపాలి థియేటర్లో అయితే 30 సార్లు రిలీజైంది. 1995 నుంచి చాలా ఏళ్ల వరకు ప్రతి రెండు వారాలకు ఓ సారి రీ రిలీజ్ చేస్తూ వచ్చారు. అలా ఇప్పటివరకు 555 సార్లు రిలీజ్ అవగా , ఇది 556 సారి . అలా క్కువ సార్లు రీ రిలీజ్ అయిన ఇండియన్ మూవీగా ఓం సినిమా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. విచిత్రం ఏంటంటే …ఇన్ని రిలీజ్లలో ఓం సినిమా 70 సార్లు 100 రోజులు ఆడటం . ఇది ఇంకో దిమ్మతిరిగే రికార్డ్ .




