శ్వేతసౌధ పీఠంపై మరోసారి ట్రంప్‌

శ్వేతసౌధ పీఠంపై మరోసారి ట్రంప్‌

– అమెరికా అధ్యక్షుడిగా నేడు ట్రంప్‌ ప్రమాణం
– నాడు నిరసనలు నేడు అక్కడే సంబరాలు
– వేలాదిగా తరలివస్తున్న మద్దతుదారులు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం(నేడు) రెండోసారి భాధ్యతలు చేపట్టనున్నారు. దేశం రాజకీయంగా రెండుగా చీలిపోయిన తరుణంలో వైట్‌హౌస్‌లోకి తిరిగి వస్తున్న ట్రంప్‌ అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా మారుద్దాం అన్న నినాదాన్ని నిలబెట్టుకుంటారని ఆయన మద్దతుదారులు ఆశిస్తున్నారు. ట్రంప్‌ ప్రమాణస్వీకారం సందర్భంగా వాషింగ్టన్లో గట్టి భధ్రత ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడిగా తాను చేసే తొలి ప్రసంగంలో ఐక్యతను సాధించడమే ప్రధాన అంశం కానున్నట్లు ట్రంప్‌ తన అభిప్రాయాన్ని తెలపడం విశేషం.

తొలిరోజు సంతకాలు-
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం భాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా సుమారు 100 అధికారిక ఉత్తర్వులు(ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లు)పై సంతకాలు చేయనున్నట్లు తెలుస్తుంది. వీటిలో చాలావరకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చేవే ఉంటాయని మద్దతుదారులు ఆశిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button