దేశ వ్యాప్తంగా ఘనంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దాదాపు నాలుగువేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. వీరిలో రైతులు, యువత, మహిళలు, అల్పాదాయ వర్గాలవారు ఉన్నారు. వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులను 11 బృందాలుగా విభజించారు. వీరిలో వెయ్యిమంది మంది అతిథులు వ్యవసాయం, రైతు సంక్షేమ రంగానికి చెందినవారు.
78వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు దేశ వ్యాప్తంగా గ్రాండ్గా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి వరుసగా 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇంతకుముందు ఈ ఘనతను పండిట్ జవహర్లాల్ నెహ్రూ సాధించారు. నెహ్రూ దేశ మొదటి ప్రధానమంత్రిగా వరుసగా 11 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాలు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దాదాపు నాలుగువేల మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించారు. వీరిలో రైతులు, యువత, మహిళలు, అల్పాదాయ వర్గాలవారు ఉన్నారు.
వేడుకలకు హాజరయ్యే ప్రత్యేక అతిథులను 11 బృందాలుగా విభజించారు. వీరిలో వెయ్యిమంది మంది అతిథులు వ్యవసాయం, రైతు సంక్షేమ రంగానికి చెందినవారు కాగా.. యువజన విభాగం నుంచి 600 మంది, మహిళా శిశు అభివృద్ధి నుంచి 300 మంది అతిథులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 300 మంది, గిరిజన శాఖ నుంచి 350 మంది అతిథులు హాజరుకానున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొన్న మొత్తం 117 మంది భారతీయ అథ్లెట్లు ఎర్రకోటలో జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు.



